డైరీ ప్రచురణకు , ప్రకటనలు అందించి విశేషంగా సహకరిస్తున్న మన
నిజామాబాదు నాన్ గ్రాడ్యుయోట్ వేటరినేరియన్స్ కు ధన్యవాదములు .
Dec 5, 2011
ప్రతి సంవత్సరం పొదుగువాపు మరియు గాలికుంటు వ్యాది వలన పాడి రైతు ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది .సరి అయిన పరిశుబ్రత పాటించకపోవటం వల్ల వ్యాదికారక సూక్ష్మజీవులు పొదుగు ద్వారా ప్రవేశించి ఈ వ్యాదిని వ్యాపింప చేస్తాయి . కావున మన పశు వైద్య సహాయకులు దీనిని గురించి రైతుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది . శుబ్రంగా పొదుగును కడగటం , పొడి బట్ట తో తుడవటం , పరిశుబ్రమైన ప్రదేశం లో పాలను పిండటం ,పొదుగుపైన పుండ్లు లేకుండా చూసుకోవటం , లాంటివి చేస్తూ వుండాలి .
వెటర్నరీ టెక్నిషియన్ యొక్క గుర్తు ఇది .
ఇది కంగాయం జాతి ఆబోతు . కర్నాటక లోని మైసూరు తదితర ప్రాంతాలలో ఇవి కనిపిస్తాయి. చాల చురుకుగా పని చేస్తాయి . కొమ్ములు వాడిగా వుంటాయి .
ఇది ఒంగోలు జాతి ఆబోతు .ప్రపంచంలోనే అత్యంత ఆదరణ గలిగిన పశువు. ఇది అత్యంత ద్రుడమైనది. మరియు ఎత్తైనది. ప్రస్తుతం ఈ జాతి ఆబోతులు చాల తక్కువగా వున్నాయి .
Nov 30, 2011
మొట్ట మొదటి సారిగా , నిజామాబాద్ జిల్లాలో మొదలైన ఈ అంతర్జాలపు సమాచారం మున్ముందు మరింత వేగంగా , మన వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ యొక్క ప్రగతిని ముందుకు తీసుకు వెళ్తుందని తెలియపరుస్తూ దానికి మీ అందరి కృషి , మరియు ప్రోద్భలం నాకు అందించాలని , మీకు తెలిసిన ఎ సమాచారాన్నయినా క్రింది చిరునామాలకు పంపిస్తే దాన్ని ఈ అంతర్జాలపు వేదిక పైన ప్రపంచమంతా వీక్షించేలా పొందు పరుస్తానని విన్నవించుకుంటున్నాను. క్రిందిచిరునామాలకుమీరుఏదైనాసమాచారంపంపించవచ్చు ...... యస్. శ్రీనివాస్ రావు (వెటర్నరీ అసిస్టెంట్ ) (ప్రెసిడెంట్)